వేగవంతంగా రోడ్డు విస్తరణ పనులు
ASF: కాగజ్‌నగర్ పట్టణంలో రహదారి విస్తరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేసిన పరిధి మేర దుకాణాలు, ఇళ్లు స్వచ్చందంగా కూల్చివేస్తూ విస్తరణకు మార్గం సుగమం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గి రహదారి విస్తరణ పూర్తయితే ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని స్థానికులంటున్నారు.