'బస్తా యూరియా దొరికితే లాటరీ తగిలినట్లే'

VZM: బొబ్బిలిలో యూరియా కోరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒక బస్తా యూరియా దొరికితే లాటరీ తగిలినంత ఆనంద పడుతున్నారని రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు వేమురెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. అప్పుడప్పుడు విడుదలైన యూరియాను అందరికీ అందడం లేదన్నారు. పూర్తిస్థాయిలో యూరియా రాకపోవడంతో రైతులు రోజుల తరబడి తిరగాల్సి వస్తుందన్నారు.