VIDEO: స్వాగతం పలుకుతున్న పచ్చని చెట్లు

ELR: చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామం పచ్చని చెట్లతో అలరారుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామం నుండి కొండపర్వ వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతూ పర్యావరణం అంటే ఇలా ఉండాలి అంటూ ముందు తరాలకు సందేశం అందిస్తున్నట్లు కనిపిస్తాయి. చెట్లను కొట్టేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక్కడ చెట్లు నీడనిస్తున్నాయి.