అక్రమంగా గంజాయి రవాణా.. ఏడుగురు అరెస్ట్
ATP: గంజాయి ముఠా గుట్టును అనంతపురం త్రీటౌన్ పోలీసులు రట్టు చేశారు. విశాఖ జిల్లా తునిలో గంజాయి కొనుగోలు చేసి రైలులో అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 1/2 కేజీల గంజాయి, 8 సెల్‌ఫోన్లు, రూ. 2,700 నగదు, బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనంతపురం, బాగేపల్లిలో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.