వచ్చే నెల 7న శ్రీవారి ఆలయం మూసివేత

వచ్చే నెల 7న శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. సెప్టెంబర్ 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. అర్థరాత్రి 1:31 గంటలకు ముగుస్తుంది. 8న ఉదయం 3గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. 8వ తేదీన ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.