భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
VSP: పీఎంపాలెం అయ్యప్పనగర్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలైన మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 335 గ్రాముల బంగారం, 1,177 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 17 కేసులు ఉన్న పాత నేరస్థుడు ఆది ప్రసాద్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.