VIDEO: లారీ ఢీకుని.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: లారీ ఢీకుని.. వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లి మండలంలో గురువారం సాయంత్రం లారీ ఢీకొని స్కూటరిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. చిప్పిలి వినాయక నగర్‌కు చెందిన బాబు(55) మదనపల్లి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా చిప్పిలి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఆయన బైకును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన బాబును వెంటనే మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయనను రుయాకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.