VIDEO: చెట్టు మీద పడి వ్యక్తి మృతి

VIDEO:  చెట్టు మీద పడి వ్యక్తి మృతి

ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి బోజయ్య(62) అటవీశాఖకి చెందిన అడితిలో సోమవారం కూలి పనుల కోసం వచ్చారు. కర్రల లోడింగ్ చేస్తున్న సమయంలో ఒక చెట్టు అతనిపై పడింది. వర్షానికి నానిపోయి చెట్టు మీద పడినట్లు తోటి కూలీలు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.