'కిరాణా షాపులో చోరీ చేశారు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్'
BHPL: కాటారం మండలం దేవారంపల్లిలో ఈ నెల 12న కిరాణా షాపులో చోరీ చేసిన ఇద్దరు నిందితులను కాటారం పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.8,300 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు ట్రాక్టర్ బ్యాటరీలు, ఒక హోమ్ థియేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.