VIDEO: ఎన్నికల కోడ్.. నేతల ఫ్లెక్సీలు తొలగింపు!
ADB: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందో లేదో కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్‌లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. తాజాగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్టిక్కర్ అంటించారు.