నిధుల అవకతవకలపై డిప్యూటీ CEO విచారణ

నిధుల అవకతవకలపై డిప్యూటీ CEO విచారణ

CTR: పుంగనూరు మండల కార్యాలయంలో 2023- 24 సంవత్సరంలో జరిగిన రూ.1.36 కోట్ల నిధుల అవకతవకలపై బుధవారం జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటనారాయణ విచారణ చేపట్టారు. ఈ మేరకు గత ఎంపీడీవో, సంబంధిత అధికారులపై విచారణ చేపట్టి నిధులు అవకతవకలు చేసిన సునీల్‌పై చర్యలు తీసుకునేందుకు నివేదిక తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.