VIDEO: దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువ

SRCL: వేములవాడ పట్టణంలో మురికి కాలువ నుండి దుర్గంధం వెదజల్లుతుందని కాలనీవాసులు పేర్కొంటున్నారు. మురికి నీరు నిల్వ ఆగడం వల్ల దోమలు విలయతాండవం చేస్తున్నాయని, కాలనీ వాసులు రోగాల బారినపడుతున్నారని వాపోయారు. మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.