బుగ్గనను కలిసిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్

బుగ్గనను కలిసిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్

KRNL: డోన్‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మంగళవారం కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సుధాకర్ తెలిపారు.