VIDEO: మహానందిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
NDL: మహానంది మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం తిమ్మాపురం, గాజులపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలు, క్రీస్తు జ్యోతి పాఠశాలలో విద్యార్థులు ఫిజికల్ సైన్స్ పరీక్ష రాసేందుకు వెళ్లారు. ఎస్సై రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.