టీ తాగుతూ ప్రజలతో ముచ్చటిస్తూ ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డిగూడ పరిధిలోని ఈమార్ గూడ టిఫిన్ సెంటర్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో చేసిన మోసాలను ప్రజలకు గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కేసీఆర్ పాలన గురించి వివరిస్తూ, బీఆర్ఎస్‌కు ఓటు వేసి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.