రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
SRPT: కోదాడ గాంధీనగర్‌కు చెందిన ఏసుపంగు గౌతమ్ తన స్నేహితుడు సంతోష్‌తో బైక్‌పై కాఫీ తాగేందుకు వెళ్తుండగా రంగా థియేటర్ సమీపంలో బైకు అదుపు తప్పింది. ప్రమాదంలో గౌతమ్ డివైడర్‌కు ఢీ కొని తీవ్ర గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల్లో తీవ్ర శోకాన్ని రేకెత్తించింది.