'చలో హైదరాబాద్ మహాగర్జనను విజయవంతం చేయాలి'

BHPL: సెప్టెంబర్ 9న జరిగే చలో హైదరాబాద్ వికలాంగుల, ఆసరా పెన్షన్‌దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని MRPS MSP భూపాలపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ పిలుపునిచ్చారు. గోరుకొత్తపల్లి మండలంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. 50 లక్షల కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని, పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.