బస్ స్టేషన్‌ను సందర్శించిన రీజనల్ మేనేజర్

విశాఖలో ద్వారకా బస్ స్టేషన్‌ను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం సందర్శించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరోజున ప్రతి బస్ స్టేషన్‌లో ముఖ్య అతిథుల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అధికారులకు సూచించారు.