ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఛైర్మన్
కృష్ణా: చల్లపల్లిలోని సీఆర్ వికాస కేంద్రంలో సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు డాక్టర్ రావెళ్ల ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథగా ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు విచ్చేసి ఇఫ్తార్ విందు ప్రారంభించారు. డీసీ ఛైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు పాల్గొన్నారు.