మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ స్పీకర్
SKLM: వైఎస్‌ఆర్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆమదాలవలస తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ చిరస్మరణీయమన్నారు.