కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్

VSP: కొయ్యూరు మండలం ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్, కంప్యూటర్ ఆపరేటర్ కుమారిని సస్పెండ్ చేశామని డ్వామా పీడీ డీవీ విద్యాసాగర్ తెలిపారు. గతంలో వీరు చింతపల్లిలో విధులు నిర్వహించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామన్నారు.