'ఓపెన్ స్కూల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు'

KMM: ఓపెన్ స్కూల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్‌లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు సరఫరా, కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని అధికారులను సూచించారు.