కమిషనర్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఫిర్యాదు

WGL: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ డివిజన్‌లకు నిధుల కేటాయింపులలో వివక్ష చూపుతున్నారని కమిషనర్ చాహత్ బాజ్ పాయికి ఫిర్యాదు చేశారు. బుధవారం GWMC కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి నిధుల కేటాయింపు వివక్షను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.