ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణంలో సూపర్ సిక్స్ పథకాల హామీల లో భాగంగా నేడు శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాత బస్టాండ్ వద్ద ఉచిత బస్సు ప్రయాణాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సీఎం చంద్రబాబు నాయుడు 'స్త్రీ శక్తి' ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను ప్రారంభింపచేశారని తెలిపారు.