కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్మాబాద్ మండలం ఈగలపెంట వద్ద శ్రీశైలం వెళ్తున్న భక్తుల కారులో మంటలు చెలరేగాయి. పొగలు వస్తున్నట్లు గుర్తించిన వెంటనే కారులోని ఆరుగురు కుటుంబసభ్యులు కిందకు దిగిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నారు. అయితే ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతంతోనే ఇలా జరిగినట్లు సమాచారం. అనంతరం వారంతా వేరే వాహనంలో శ్రీశైలం చేరుకున్నారు.