VIDEO: 'మామిడి రైతులకు అన్యాయం జరుగుతుంది'
MHBD: ప్రస్తుత సీజన్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మరిపెడ మండలం గుండెపూడి శివారులోని 25 ఎకరాల మామిడి తోటను సీపీఎం మండల కార్యదర్శి మధుసూదన్‌తో పాటు నాయకులు పరిశీలించారు. ఈ సీజన్‌లో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.