'మధ్యవర్తిత్వం - దేశం కోసం'పై అవగాహన ర్యాలీ

'మధ్యవర్తిత్వం - దేశం కోసం'పై అవగాహన ర్యాలీ

VZM: గజపతి నగరంలో 'మధ్యవర్తిత్వం - దేశం కోసం' అనే అంశంపై న్యాయవాదులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లెంక రాంబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు బైక్ ర్యాలీ జరిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు 90 రోజులపాటు కార్యక్రమాలు జరుగుతాయని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.