రష్మికను ఆశీర్వదించండి: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఇవాళ సాయంత్రం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ఈ కొత్త జంట తెలుగు మీడియాతో ముచ్చటించింది. 'తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, బాగా చూసుకోండి' అంటూ విజయ్ సరదాగా మాట్లాడాడు. తమ ప్రయాణంలో మీడియా భాగస్వామ్యం మరువలేనిదని, అందరి ఆశీస్సులు కావాలని కోరాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టడం సంతోషంగా ఉందని రష్మిక తెలిపింది.