శానిటరీ కార్మికులకు శిక్షణ కార్యక్రమం
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని 27, 29వ వార్డుల్లో శానిటరీ కార్మికులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనితీరుపై అవగాహన కల్పించారు.