VIDEO: మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిలిచిన వాహనాలు

VIDEO: మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిలిచిన వాహనాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ వద్ద మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న వాహనాలతో బ్యారేజ్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం కొంతమేర వాహనాలను అనుమతించి సాయంత్రం రాకపోకలను నిలిపివేశారని ప్రయాణికులు ఆరోపించారు.