మాజీ ఎంపీపీ స్వర్గీయ గంట్ల దయాకర్ రెడ్డికి నివాళి
NLG: చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామంలో మాజీ ఎంపీపీ స్వర్గీయ గంట్ల దయాకర్ రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీగా గ్రామానికి, మండలానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన పేరుతో కుటుంబ సభ్యులు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.