బార్లకు నేటితో దరఖాస్తులు ముగింపు

CTR: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్‌లకు దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగియనుంది. సోమవారం వరకు 11 బార్లకు మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.