ప్రసిద్దిగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి
BHNG: యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రం. ఈ ప్రాంతంలో లక్ష్మినరసింహ స్వామివారు స్వయంభువుగా వెలిశారు. ఇక్కడ స్వామివారు ఐదు రూపాల్లో దర్శనమిస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శించే అద్భుత పర్యాటక క్షేత్రం.