సమ్మె నేపథ్యంలో ఆస్తుల ధ్వంసంపై కఠిన చర్యలు: సీపీ

సమ్మె నేపథ్యంలో ఆస్తుల ధ్వంసంపై కఠిన చర్యలు: సీపీ

KMM: టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. బస్సులపై రాళ్లు రువ్వడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించి చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.