విషం త్రాగి మహిళ మృతి

KDP: విషం త్రాగి మహిళ మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. వివరాల మేరకు లక్ష్మీ 45 సంవత్సరాల మహిళ వ్యక్తిగత కారణాల వల్ల విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.