వ్యవసాయ విద్యుత్ సరఫరాలో సమస్యలున్నాయా..?
TPT: జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో రైతులు విద్యుత్ జాప్యంపై ఫిర్యాదు చేశారు. అధికారులు రైతులకు నేరుగా సమాచారం ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాట్సాప్ 1800 425 155333కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.