ఈ జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు

ఈ జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు

AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు రేపు సెలవు ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.