ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

NDL: బనగానపల్లె పట్టణ సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయ ప్రాంగణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. సాయిబాబా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు బీసీ రాజారెడ్డి తెలిపారు. ఆలయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని బీసీ రాజారెడ్డి అన్నారు.