ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపు

ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపు

VSP: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి. వామనమూర్తి పిలుపునిచ్చారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.