టీటీడీసీ కేంద్రంలో మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ

టీటీడీసీ కేంద్రంలో మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ

ASF: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు కమిషనర్ రాజు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న ఈ కేంద్రంలో ఈనెల 28 నుంచి 30 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు గడువులోగా తమ నామినేషన్లను దాఖలు చేయాలని ఆయన సూచించారు.