అశ్వాపురంలో అక్రమ ఇసుక రవాణా
BDK: అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున అక్రమ ఇసుక రవాణా బహిరంగంగా సాగుతున్నట్లు స్థానికులు బుధవారం ఆరోపిస్తున్నారు. గోదావరి తీరంలో ప్రాజెక్టు కోసం కట్ట నిర్మాణం చేపట్టే పేరుతో భారీగా ఇసుకను పోశారని, ఇప్పటికే దాదాపు 400 లారీలు ఇసుకను కట్ట ప్రక్కన పోసినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.