ఈనెల 7న భద్రకాళి ఆలయం మూసివేత

WGL: సంపూర్ణ చంద్ర గ్రహణం ఆదివారం రాత్రి 9:56 గంటలకు సంభవించనుందని వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. గ్రహణ వేదను పురస్కరించుకొని ఆలయంలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమ్మవారికి పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. గ్రహణ మోక్షానంతరం ఆలయంలో శుద్ధి , సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.