మహబూబ్‌నగర్‌లో పొగమంచు హెచ్చరిక!

మహబూబ్‌నగర్‌లో పొగమంచు హెచ్చరిక!

మహబూబ్‌గర్ జిల్లాలో శీతాకాలం తీవ్రంగా ఉండడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా నమోదవుతోంది. విజిబిలిటీ తగ్గిపోవడంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ డి. జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 తర్వాత అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.