నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLR: పీకే పాడు సబ్ స్టేషన్ నుంచి చింతలాత్మకూరు సబ్ స్టేషన్ వరకు 33 కేవీ లైన్ కోసం కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు (ఎరెక్షన్) చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలువాయి మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.