శ్రీకాళహస్తిలో తెప్పోత్సవానికి పోటెత్తిన భక్తజనం

శ్రీకాళహస్తిలో తెప్పోత్సవానికి పోటెత్తిన భక్తజనం

TPT: శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నారద పుష్కరిణిలో తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. సర్వాలంకార భూషితులైన గంగాదేవి సమేత మహేశ్వరుడు, ఉమాదేవిలను మంగళవాయిద్యాల మధ్య పుష్కరిణి వద్దకు తరలించి, సుందరంగా అలంకరించిన తెప్పపై ఊరేగించారు. పుష్కరిణిలో స్వామివారి విహారాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.