వినూత్నంగా మంత్రి వివేక్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు

వినూత్నంగా మంత్రి వివేక్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు

MNCL: మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇద్దరు అభిమానులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు వెంగళ ఉదయ్ కుమార్, కొమ్మేర గ్రామానికి చెందిన జనగామ పవన్‌లు ఆదివారం మంత్రి పుట్టినరోజు సందర్బంగా ధాన్యం గింజలతో మంత్రి వివేక్ చిత్రపటాన్ని గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.