వీపనగండ్లకు చెందిన వ్యక్తి వనపర్తిలో అదృశ్యం
WNP: వీపనగండ్ల మండలం గోవర్ధనగిరికి చెందిన శ్రీనివాసులు (45) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న చింతకాయలు అమ్మడానికి తన ఆటోలో వనపర్తికి వచ్చిన శ్రీనివాసులు తిరిగి ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు వెతకగా.. అతని ఆటో వనపర్తి బస్టాండ్ పార్కింగ్‌లో లభ్యమైంది. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.