VIDEO: బుల్లెట్ బండిపై ప్రయాణించిన మంత్రి సీతక్క

MLG: తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం మంత్రి సీతక్క వనదేవతల జాతర సన్నాహక పనులను పరిశీలించారు. ఎస్పీ శబరీష్ బైక్ నడుపుతుండగా, మంత్రి వెనుక కూర్చుని రహదారుల పరిస్థితిని సమీక్షించారు. లక్షలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని, జాతర విజయవంతం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.