భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్

భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని ఏబీఎన్ పాలెంలో ఏప్రిల్ 9న భార్య దాసరి ప్రేమ కుమారిని రోకలి బండతో దారుణంగా హత్య చేసిన భర్త దాసరి గంగరాజు (38)ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.