'పీఎం ధనధాన్య కృషి యోజన'పై కలెక్టర్ సమీక్ష
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన 'పీఎం ధనధాన్య కృషి యోజన' (PMDDKY) అమలు పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. రైతులకు మార్కెట్ అనుసంధానం బలోపేతం చేయడానికి స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు లాభదాయకమైన పంటల ప్రోత్సాహం, విలువ ఆధారిత ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలపై శాఖలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.